365 రోజుల్లో వందపడకల ఆసుపత్రి..! మంత్రి నారా లోకేష్ ప్రకటన..!
మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపడమే తన ధ్యేయమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, రెండో కేబినెట్ సమావేశంలోనే మంగళగిరికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి, శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రానున్న 365 రోజుల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి నియోజకవర్గం…

