Editor

NationalTechnology

స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరో ముప్పు.. మరో కొత్త మాల్వేర్..?

స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరో ముప్పు వచ్చి పడిందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా స్పార్క్ క్యాట్ అనే వైరస్ స్మార్ట్ ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని కాజేస్తోందని, తద్వారా తీవ్ర నష్టం కలుగజేస్తోందని అంటున్నారు.   ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘కాస్పర్ స్కై’ చెబుతున్న వివరాల ప్రకారం… ఈ స్పార్క్ క్యాట్ వైరస్ మాల్వేర్ రకానికి చెందినది. ఇప్పటికే దీన్ని 28 యాప్ లలో గుర్తించారు. వీటిలో 10 ఆండ్రాయిడ్ యాప్ లు కాగా,…

AP

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైన విషయం విదితమే. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఈసారి అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన సభ్యుల సంఖ్య అధికంగా ఉండటంతో వీరికి అవగాహన తరగతులను నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు.   అసెంబ్లీ సమావేశాలకు ముందుగా ఈ నెల 22, 23…

AP

గృహ హింస కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు..

గృహ హింస కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులందరినీ భాగస్వామ్యం చేయడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని ఇరికించాలనే ధోరణి పెరుగుతోందని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తనకు అండగా నిలవలేదనో, భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా చూస్తూ ఉన్నారన్న కోపంతోనో ఇలాంటి కేసుల్లో వారిని కూడా ఇరికిస్తున్నారని గెడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.…

AP

విశాఖ ప్రధాన కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..

శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో విశాఖ రైల్వే జోన్‌కు ఆమోదం లభించింది. విశాఖ రైల్వే జోన్ పరిధికి ఆమోదం తెలుపుతూ, విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు వాల్తేర్ డివిజన్‌గా ఉన్న దానిని విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.   దీంతో విభజన చట్టంలో ఉన్న ఒక ప్రధాన హామీ నెరవేరినట్లయింది. నూతనంగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి, దానిని…

TELANGANA

ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ..!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భారీ ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి భోజనం చేయకుండా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి యూనివర్సిటీ పరిపాలనా భవనాన్ని ముట్టించారు.   పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిలబస్ పూర్తవకుండానే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల వాయిదాపై యూనివర్సిటీ రిజిస్ట్రార్‌తో మాట్లాడినా…

TELANGANA

హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ వార్నింగ్..

హైదరాబాద్‌లో హైడ్రా దూసుకుపోతోంది. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు వెళ్లి యాక్షన్ షురూ చేస్తోంది హైడ్రా టీం. అయితే బాధితుల సమస్యలు వినడానికి వెళ్ళిన హైడ్రా కమిషనర్ కు .. హైకోర్టు న్యాయవాదికి మధ్య వివాదం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.   ఈ ఘటనకు సంబంధించి పవర్తి వివరాల్లోకి వెళ్తే..…

TELANGANA

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ కమిషనర్‌ను పౌరసరఫరాల శాఖ సూచించింది. కాగా, కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.   రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త కార్డుల జారీ ప్రారంభించిన సమయంలో.. ఎంపిక చేసిన గ్రామాల్లో సుమారు లక్ష కార్డులను పంపిణీ…

National

కీచ‌కులుగా మారిన టీచ‌ర్లు.. 13 ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం..

పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పాల్సిన టీచ‌ర్లే కీచ‌కులుగా మారారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన‌ ముగ్గురు ఉపాధ్యాయులు 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే… త‌మిళ‌నాడు కృష్ణ‌గిరి స‌మీపంలో ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 13 ఏళ్ల బాలిక 8వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది.   అయితే, గ‌త కొన్ని రోజులుగా విద్యార్థిని స్కూల్‌కి రావ‌డం లేదు. ఈ విష‌య‌మై ప్ర‌ధానోపాధ్యాయుడు, తోటి విద్యార్థినులు ఆరా తీయ‌గా దాట‌వేత ధోర‌ణితో స‌మాధానం చెప్పుకొచ్చింది.…

TELANGANA

ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం..

తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయాల ప్రకారం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీసీ కాకతీయ హోటల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు.…

AP

వైసీపీ హయాంలోని మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి రూ. 90 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్‍‌ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.   ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో…