బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని.. అయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు. జిల్లా కలక్టరేట్ లో అధికారిక సమావేశంలో గందరగోళం సృష్టించి, మీటింగ్ ని పక్కదారి పట్టించారని…

