ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించిన ఆసక్తికర వివరాలు..!
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి కాబోయే సీఎం రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆమె అత్యున్నత సీఎం పదవిని చేపట్టబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ…

