తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రైతు భరోసా దరఖాస్తుకు సిద్దం కండి..
తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురుచూస్తున్న ఆ పథకంపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. కొత్త ఏడాదిలో వరుస శుభవార్తలు చెప్పేందుకు సీఎం రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 2025 జనవరి నెలలో ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను…

