రైతుబంధుపై కుట్ర జరుగుతోంది: హరీశ్ రావు
రైతుబంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రైతుబంధు కంటే రూ. 500 బోనసే మేలని రైతులు చెబుతున్నారంటూ వ్యవసాయశాఖ మంత్రి చెప్పడం దారుణమని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుబంధును బంద్ చేస్తారని…

