తెలంగాణాను ఎడారి చేసే ప్లాన్; రేవంత్ రెడ్డి రేసుగుర్రం కాదు..కీలుగుర్రం..ఎమ్మెల్సీ కవిత..!
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కరువుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీ ఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేశారు. తెలంగాణలో నీళ్లు ఉన్న ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సాగునీటికి తాగునీటికి కటకట వస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ వదలడం లేదని ఆమె మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిలా…

