Editor

National

ఎన్నికల వేళ.. ఈసీ కీలక నివేదిక విడుదల..

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.   ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా…

TELANGANA

కేసీఆర్ సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్..!

తెలంగాణా రాష్ట్రంలో గతంలో రెండు పర్యాయాలు పాలన సాగించిన బీఆర్ఎస్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి దూకుడుగా పాలన సాగిస్తున్నారు. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.   ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా, తాజాగా మాజీ సీఎం…

TELANGANA

ఓటుకు నోటు కేసులో సుప్రీంలో కీలక పరిణామం..!!

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.   ఓటుకు నోటు కేసు హైదరాబాద్ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను…

AP

వైఎస్ బతికుంటే ఉమ్మేసే వాడు-షర్మిలపై రోజా ఫైర్.. ..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక తర్వాత వైసీపీ నేతల్ని వరుసగా టార్గెట్ చేస్తుండటంతో అధికార పార్టీ కూడా అంతే దీటుగా బదులిస్తోంది. ఇందులో ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజాకూ, వైఎస్ షర్మిలకూ మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ మరోసారి వైఎస్ షర్మిలపై మంత్రి రోజా రెచ్చిపోయారు.   వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో…

AP

చంద్రబాబుకు భారీ ఊరట-గవర్నర్ అనుమతిపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఓ ఎత్తు. కానీ ప్రభుత్వం దూకుడుగా విపక్షాలపై తీసుకునే నిర్ణయాలు మరో ఎత్తుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఓ కీలక కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబుపై నమోదైన కేసుల విషయంలో అరెస్టును సమర్ధిస్తూ రిమాండ్ కు సైతం పంపిన కోర్టు.. ఇవాళ మాత్రం దానికి భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంది.   టీడీపీ అధినేత…

National

సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం..

మాల్దీవుల-భారత్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్దీవులలో ఉండే భారత భద్రత బలగాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ఉన్న మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక సిబ్బందిని మాలేలో ప్రవేశపెడతామని విదేశాంగ కార్యదర్శి రణ్ ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.

TELANGANA

మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ కమిటీ నివేదికలో సంచలన విషయాలు..

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో 16 నుంచి 21వ పియర్స్‌ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. అంతేగాక, 6,7,8 బ్లాకులను ఎల్ అండ్ టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో వెల్లడించింది.   కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం…

TELANGANA

కేసీఆర్‌పై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు సీఎం రేవంత్.   కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్న రేవంత్ రెడ్డి..…

AP

పవన్ కల్యాణ్ పోటీపై నాగబాబు క్లారిటీ..!

ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. ఢిల్లీ కేంద్రంలో ఏపీలో పొత్తుల రాజకీయం కొనసాగుతోంది. చంద్రబాబు తిరిగి ఎన్డీఏలో చేరేలా అడుగులు వేస్తున్నారు. అటు జగన్ రేపు (శుక్రవారం) ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన తో బీజేపీ పొత్తు ఖాయమైతే మరోసారి సీట్ల పంపిణీ పైన కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు రోజుల్లోనే బీజేపీ తో పొత్తు వ్యహారం తేలిపోనుంది. ఇటు పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం గురించి నాగబాబు…

AP

ప్రధానితో జగన్ భేటీ..

ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. పొత్తుల లెక్కలు సమీకరణాలు మారుతున్నాయి. ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి చేరటం దాదాపు ఖాయమైంది. అమిత్ షా తో చంద్రబాబు తాజా భేటీలో ఈ మేరకు చర్చ జరిగింది. కొన్ని ప్రతిపాదనల పైన తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ఆసక్తి కరంగా మారింది. ఇటు ఢిల్లీకి వెళ్లే ముందు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశం కానున్నారు. మారుతున్న లెక్కలు…