Editor

NationalTELANGANA

రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు..

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌, జోన్‌ పరిధిలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లలోని టిక్కెట్‌ కౌంటర్లలో డిజిటల్‌ చెల్లింపులు అందుబాటులో తీసుకొచ్చారు. POS, UPI (ఫోన్ పే, Google Pay మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ నగదు రహిత విధానం వల్ల ప్రయాణికుల సమయం ఆదా కావడమే కాకుండా చిల్లర సమస్యలు ఉండవని అధికారుల తెలియజేశారు. త్వరలోనే అన్ని చోట్ల ఈ సౌకర్యాలను తీసుకొస్తామని రైల్వే శాఖ తెలిపింది.

TELANGANA

నీటి పారుదల శాఖలో భారీప్రక్షాళన..

నీటి పారుదల శాఖలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై చర్యలు చేపట్టింది. రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈఎన్‌సీ జనరల్ మురళీధర్ రావును రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మరికొందరు ఇంజినీర్లపైనా వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.   తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం…

TELANGANA

రేవంత్ Vs కేసీఆర్, సభా సమరం..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. కాగా.. 10వ తేదీన ప్రభుత్వం శాసనసభలో ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. సమావేశాలు 17వ తేదీ వరకూ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై ప్రభుత్వం..బీఆర్ఎస్ పైన చర్చ జరుగుతోంది.   నేటి నుంచి అసెంబ్లీ: తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయాల వేళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…

AP

ఎన్నికల బరిలో నాగబాబు – నియోజకవర్గం ఖరారు..!!.

ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. అభ్యర్దుల ఎంపిక పైన ప్రధాన పార్టీలు కసరత్తు వేగవంతం చేసాయి. సీఎం జగన్ అభ్యర్దుల కసరత్తు తది దశకు చేరింది. టీడీపీ జనసేన సీట్ల ఖరారు పైన ఒక అంచనాకు వచ్చినా..ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయం పైన చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాతనే అధికారికంగా సీట్ల ప్రకటన జరగనుంది. ఈ సమయంలోనే మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయటం దాదాపు ఖాయమైంది.   పొత్తులు-…

AP

అమిత్ షాతో చంద్రబాబు భేటీ..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాుల చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. అలాగే, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. అయితే, టీడీపీతో బీజేపీ పొత్తుపైనే ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ ఎంపీలతో ఆయన సమావేశం అయ్యారు.   అనంతరం బుధవారం రాత్రి కేంద్రమంత్రి అమిత్ షా…

National

‘భారత్ రైస్’ అమ్మకాలు నేటి నుంచే..

సామాన్యులకు ఊరట కలిగించే వార్త. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘భారత్ రైస్’ (Bharat Rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని మంగళవారం (ఫిబ్రవరి 8న) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.   రూ. 29కే కేజీ భారత్ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార…

TELANGANA

బాల్క సుమన్‌పై క్రిమినల్ కేసులు నమోదు..

భారత్ రాష్ట్ర సమితి అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు ఆయనపై మండిపడుతున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. మాటలదాడికి దిగారు.   తాజాగా- బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, చెన్నూర్ మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్.. రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. ఘాటు విమర్శలు చేశారు. అనేక ఆరోపణలను సంధించారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద పాలేరుగా అభివర్ణించారు. మంచిర్యాల…

TELANGANA

సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు గంటపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.   సోనియాతో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియా గాంధీతో సమావేశమైనట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి…

AP

జగన్ ఎన్నికల వరాలు – ప్రధాన ఓట్ బ్యాంక్ పై గురి, ఆపరేషన్ అపోజీషన్..!!..

ఏపీలో సీఎం జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సిద్దం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబు తో అందరూ ఓడాల్సిందేనని నినదించారు. ప్రతీ సీటు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. తాము అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తమను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో కొత్త వరాల పైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త బడ్జెట్ ప్రతిపాదన వేళ వీటిని ఖరారు చేసే అవకాశం ఉంది.   జగన్ కొత్త వ్యూహాలు ముఖ్యమంత్రి జగన్…

AP

వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన వాయిదా ! కారణమిదేనా..?

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే ఒకరు ఇవాళ రాజీనామా ప్రకటనకు సిద్దమయ్యారు. ఆయన అనుచరులతో భేటీ అయి ఈ ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో ఏమైందో ఏమో కానీ ప్రెస్ మీట్ పెట్టినా రాజీనామా ప్రకటన తప్ప మిగతా అన్నీ చెప్పారు. దీంతో అసలేం జరిగిందన్న చర్చ ఇప్పుడు అందరిలోనూ జరుగుతోంది.   వైసీపీలో అతి కొద్ది కమ్మ సామాజిక ఎమ్మెల్యేల్లో ఒకరైన…