Editor

AP

జనసేనకు మరో ఎంపీ అభ్యర్ధి…

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే ఓవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలో చేరికలు పెరుగుతుండగా.. ఇవాళ ఓ కీలక నేత ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన.. జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.   టీడీపీతో పొత్తులో భాగంగా దాదాపు 40…

AP

ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కరణ..

విజయవాడలో అంబేద్కర్ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు తన సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న, అంబేద్కర్ గారి మహా శిల్పం మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అని కితాబిచ్చారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు. ఇది సామాజిక న్యాయ మహా శిల్పం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.   ఈ నెల 19న, చారిత్రక, స్వరాజ్య మైదానంలో…

TELANGANA

తెలంగాణలో అదానీ భారీ పెట్టుబడులు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా ఆయన బృందం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుపర్యటనలో బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. దిగ్గజ గ్రూప్ అదానీ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.దావోస్పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy)తో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ సంస్థ రాష్ట్రంలో రూ.12,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది.…

TELANGANA

గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గత ప్రభుత్వం(బీఆర్ఎస్ సర్కారు) ప్రతిపాదించిన విషయం తెలిసిందే.   ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ వారిద్దరూ(దాసోజు శ్రవణ్,…

National

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. యోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.500 కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీకి బదులు రాముడి బొమ్మను ముద్రించినట్లుగా సోషల్ మీడియాలో ఓ నోట్ వైరల్ అవుతోంది. అయితే, నోట్‌పై ఎర్రకోట స్థానంలో అయోధ్య రామమందిరం, స్వచ్ఛ భారత్ లోగో ముద్రించినట్లు తెలుస్తోంది.

AP

ఏపీలో ఎన్నికల ఎఫెక్ట్.. 21 మంది అధికారుల బదిలీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగి ఏర్పాట్లు ప్రారంభించింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జోన్-4 పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది అధికారులను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ మేరకు సంబంధిత కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. కర్నూలు జిల్లా.. పత్తికొండ తహసీల్దార్‌గా పద్మజ, కోసగికి పీ మురళి, కౌతాళంకు అలెగ్జాండర్, అనంతపురం…

AP

చంద్రబాబు కేసుల్లో వాట్ నెక్స్ట్ – నేడే కీలకం, ఉత్కంఠ..!!.

ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటోంది. చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన సుప్రీం తీర్పు వెలువరించింది. 17ఏ పైన మాత్రం ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. అరెస్ట్, రిమాండ్ విషయంలో చంద్రబాబు వాదనతో ఏకీభవించలేదు. ఈ రోజు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్‌నెట్‌ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.   ఫైబర్ కేసులో తీర్పు: చంద్రబాబు స్కిల్…

TELANGANA

నోటీసులపై ఈడీకి షాకిచ్చిన కవిత…

ఢిల్లీ లిక్కర్ స్కాంపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత షాకిచ్చారు. విచారణకు తాను హాజరు కావడం లేదంటూ ఈడీ అధికారులకు ఈ మెయిల్ పంపేశారు. దీంతో ఇప్పుడు కవిత వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈడీ తనను విచారణకు పిలిపించడం కరెక్ట్ కాదంటూ కోర్టును ఆశ్రయించారు.   ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత…

TELANGANA

ప్రజాపాలనలో దరఖాస్తు చేసారా, ఏ పథకానికి మీరు అర్హులు – ఇలా చెక్ చేసుకోండి..!!

ఎన్నికల గ్యారంటీల అమలు దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు పథకాలు అమల్లోకి వచ్చాయి. మిగిలినవరి మార్చి 15 లోగా ప్రారంభించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఇక దరఖాస్తు చేసిన వారు ఏ పథకానికి అర్హులు, వారి అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది తెలుసుకొనేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.   దరఖాస్తుల పరిశీలన: కాంగ్రెస్ ప్రభుత్వం…

AP

ఎంపీ బెల్లాన దారెటు..?

అభ్యర్ధుల మార్పులు చేర్పులతో ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. నాలుగో జాబితా మీద ఇంకా తర్జన భర్జనలు పడుతోంది. అన్ని లెక్కలను, సర్వేలనూ ముందేసుకొని ఎవర్ని ఉంచాలో? ఎవర్నీ పక్కనపెట్టాలో? అన్నదానిపై కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించి సదరు సిట్టింగుల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఫోర్త్ లిస్ట్‌కు సంబంధించి విజయనగరం జిల్లా నుండి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు బెల్లానకి అధిష్టానం ఏమని సంకేతాలు పంపింది..? దానిపై సదరు ఎంపీ…