Editor

TELANGANA

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బంగారు చీర!!

దేశమంతా ఎప్పుడెప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ మహోత్సవం జరుగుతుందా? ఎప్పుడు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని కళ్ళారా చూస్తామా? అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్సవానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి రామయ్యకు కానుకలు తరలి వెళుతున్నాయి.   500కు పైగా ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాముడు తాను నడయాడిన పుణ్యభూమిలో కాలు పెడుతున్న సమయంలో రామయ్య పైన భక్తితో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి…

TELANGANA

లోక్ సభ ఎన్నికల్లో పోటీకి భయపడుతున్న బీఆర్ఎస్ సీనియర్లు.. .

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైన బీఆర్ఎస్ ఇప్పుడు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికలలో సత్తా చాటాలని నిర్ణయించిన క్రమంలో నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు. అయితే లోక్సభ నియోజకవర్గాల సమీక్ష తో పాటు, నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.   చాలా జిల్లాలలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి…

AP

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పై సుప్రీంలో తాజా అప్డేట్..!!..

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో 53 రోజులు రిమాండ్ ఎదుర్కొన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీని పైన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు.   సుప్రీంలో విచారణ చంద్రబాబుకు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో హైకోర్టు బెయిల్‌…

AP

వైసీపీ ఐదో జాబితా విడుదలకు కసరత్తు..

ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఐదో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్ని పిలిపించి చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు.   ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నాలుగు జాబితాల్లో…

National

అయోధ్య బాల రాముడు.. విగ్రహం ఫొటోలు విడుదల…

అయోధ్యలో ఈ నెల 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలయంలో పూజలు, యాగాలు, క్రతువులు కొనసాగుతున్నాయి. బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు సమయం దగ్గరపడుతుండటంతో ఆ మహా ఘట్టానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పరిశీలిస్తోంది.   ఈ క్రమంలోనే మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. పూజలు, మంత్రాల మధ్య రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి…

TELANGANA

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు శరవేగంగా ఏర్పాట్లు!!

తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2024 ఫిబ్రవరిలో 21నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలో మేడారంలో అభివృద్ధి పనులపై తెలంగాణా సర్కార్ ఫోకస్ పెట్టింది. మేడారం అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ మేడారం వెళ్లి మేడారం జాతర పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.   ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది,…

TELANGANA

తెలంగాణలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు..

తాను రైతు బిడ్డనని.. వ్యవసాయం తమ సంస్కృతి అని ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోక్ యాక్షన్‌పై జరిగిన సీఈటీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్నరైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. రైతులకు లాభాలు రావాలన్నది తన స్వప్నమని రేవంత్ పేర్కొన్నారు.   భారతదేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని.. రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా…

AP

ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు కేసులో సుప్రీంలో కీలక పరిణామం..!!

ఏపీలో ఎన్నికల వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసులో సుప్రీంలో విచారణకు కేసు లిస్టు అయింది. తెలంగాణ హైకోర్టు మే 31న ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటీషన్ ఫిబ్రవరి 5న విచారణకు రానుంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు…

TELANGANA

వైసీపీ నాలుగో జాబితా విడుదల..

సుదీర్ఘ కసరత్తు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాను ప్రకటించింది. తొమ్మిది మంది పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇంఛార్జీలను ప్రకటించిన విషయం తెలిసిందే.   అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే:   జీడీ…

NationalTELANGANA

అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి భారీ లడ్డు..

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న క్రమంలో దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతన్నాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటికే రామ మందిరానికి తలుపులు, పాదుకలు ఇక్కడ్నుంచే అయోధ్యకు తరలివెళ్లాయి.   తాజాగా, అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్దలతో తయారు చేసిన భారీ…