Editor

AP

షర్మిలపై వైసీపీ అటాక్ మొదలు..

కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తన పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేసిన వైఎస్ షర్మిల.. తనతో పాటు మరికొందరితో కలిసి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తనకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా నెరవేరుస్తానంటూ వ్యాఖ్యానించారు. రేపోమాపో ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం కూడా ఖాయమే. ఈ నేపథ్యంలో ఏపీలో తాను విభేదిస్తున్న అన్న పార్టీ వైఎస్సార్సీపీ నేతలు ఆమెపై మాటల దాడి ప్రారంభించారు.   వైసీపీలో అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో…

TELANGANA

బీఆర్ఎస్ భవన్‍కు రెవెన్యూ శాఖ నోటీసులు….

బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజరాహిల్స్ లోని బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ అధికారులు నోటీసీలు జారీ చేశారు. పార్టీ ఆఫీస్ లో నిబంధనలకు విరుద్దంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నోటీసులో పేర్కొంది. పార్టీ కార్యాలయంలో కొనసాగుతోన్న టీవీ ఛానెల్ ను మరో చోటికి మార్చుకోవాలని స్పష్టం చేసింది. న్యూస్ ఛానెల్ ఎప్పటిలోగా ఖాలీ చెస్తారో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.   ఈ మేరకు తెలంగాణ భవన్…

TELANGANA

అమిత్ షాతోపాటు కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలతో బిజి బిజీగా గడుపుతున్నారు. గురువారం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సందర్భంగా రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.   ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్త‌గా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికారుల‌ను అద‌నంగా…

CINEMA

ఎన్టీఆర్ న్యూ ఇయర్ కానుక అదిరింది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ఇప్పటికే విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి. మరికొన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా న్యూ ఇయర్ కానుకగా సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అనుకున్నారు. కానీ వారి ఆశలు నిరాశయ్యాయి. కొత్త ఏడాది కానుకగా ఈ చిత్రం నుంచి అప్డేట్స్ లేనట్లే అని తెలుస్తోంది. మరి అభిమానులు ఫీల్ అయితే హీరోలు సైలెంట్‌గా ఉంటారా?…

TELANGANA

రేవంత్ కొత్త సంవత్సర కానుక.. వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని ఓలా, ఉబర్‌, గిగా డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్ట్‌లు, క్యాబ్‌ డ్రైవర్లు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు…

TELANGANA

కెసిఆర్.. 22 కార్లు.. సస్పెన్స్

సరిగ్గా మూడు రోజుల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో బట్టబయలు చేసిన 22 కార్ల కహాని రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. మొదట్లో ఈ కార్ల గురించి ఎదురుదాడికి దిగిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకులు.. ఆ తర్వాత రోజుకో రకంగా మాట మార్చారు. కార్లు కొనుగోలు చేయలేదని కొంతమంది, కార్లు కొనుగోలు చేస్తే తప్పేంటని, కార్ల కొనుగోలు బాధ్యత ఇంటలిజెన్స్ చూసుకుంటుందని.. ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. సరే ఇవన్నీ పక్కన…

AP

ఏపీలో మరో సంచలన సర్వే.. గెలుపు ఎవరిదంటే?

రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేపట్టిన సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీ సంస్థ వెల్లడించింది. టిడిపి, జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అధికార వైసిపి కేవలం 42 నుంచి 55 సీట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. 18 సీట్లలో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని తేల్చి చెప్పింది. అయితే నాలుగు నుంచి ఏడు సీట్లు ఇతరులకు దక్కే అవకాశం ఉందని…

AP

కన్ఫ్యూజన్ లో టిడిపి మీడియా..

ఎందుకు, ఎక్కడ, ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఎవరు, ఈ ఆరింటి సమూహమే ఒక వార్త. ప్రత్యక్ష సంఘటన నుంచి కథనాల వరకు ఇదే వర్తిస్తుంది. అంతే తప్ప.. వివరాలు లేకుండా రాయడం.. ఏదో గాలి కబర్లు రాస్తే అది వార్త అనిపించుకోదు. ఒకప్పుడు అంటే విలువగల జర్నలిస్టులు ఉండేవారు. విలువలతో వార్తలు రాసే వారు. మేనేజ్‌మెంట్‌ ఎలాంటి ‘టాస్క్‌లు ఇచ్చినా చెత్త బుట్టలో పడేసేవారు. ఇవ్వాల్టికీ ఓ గజ్జెల మల్లారెడ్డి గురించి, ఏబీకే ప్రసాద్‌ గురించి, నండూరి…

National

ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు.   దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్‌ సయీద్‌ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన…

TELANGANA

మెట్రో సర్వీస్‌ల పెంపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు..

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని ఆయన వెల్లడించారు. మెట్రో రైలు,స్టేషన్లలో సిబ్బంది,పోలీసుల నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి రావద్దన్నారు. మెట్రో స్టేషన్ పరిధిలో ఎవ్వరితో అయినా దుర్భాషలాడినా…