Editor

APNationalTELANGANA

పొలిటికల్ యాడ్స్ రద్దు.. ఈసీ కీలక నిర్ణయం..

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రచార అస్త్రం కీలకం. అయితే.. ప్రచారంలో భాగమైన కొన్ని పొలిటికల్‌ యాడ్స్‌ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. తాము అనుమతి ఇచ్చిన ప్రకటనలను మార్చేసి, ప్రసారం చేస్తున్నారంటూ 15 యాడ్స్‌ను ఈసీ రద్దు చేసింది. దీని వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా, క్రియేటివ్‌గా యాడ్స్ రూపొందించి ప్రచారం చేయడంతో ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని, అవి అలాగే కొనసాగితే ఓడిపోతామని భయపడే బీఆర్‌ఎస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు…

TELANGANA

వేములవాడలో తుల ఉమ వర్సెస్ బీజేపీ!.. వికాస్‌రావుకు బీఫామ్‌ ఇవ్వడంతో రచ్చ..

ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో అసంతృప్తి సెగలు కాకరేపుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో తుల ఉమ వర్సెస్‌ బీజేపీ పాలిటిక్స్‌ మరింత హీట్‌ పుట్టిస్తున్నాయి. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించిన బీజేపీ.. ఆమెకు బీఫామ్‌ ఇవ్వకుండా వికాస్‌రావును బరిలో దించడంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.   తనకు టికెట్ కేటాయించి ఆ తర్వాత బీఫామ్‌ ఇవ్వకుండా పోటీ నుంచి తప్పించడంతో బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు తుల ఉమ. ఎవరైనా బీజేపీ నేతలు…

AP

అలెర్ట్.. ఏపీకి మరోసారి వర్ష సూచన..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడనుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు.

CINEMANational

ఓటీటీలకు షాక్.. కొత్త బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం..

భారత ప్రభుత్వం నూతన ప్రసార సేవల (నియంత్రణ) బిల్లును ప్రవేశపెట్టింది. ఇది ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్‌తో సహా వివిధ ప్రసార సేవలకు నియంత్రణా ఫ్రేమ్‌వర్క్‌ను ఏకీకృతం చేస్తుంది. ఈ బిల్లు ఆమోదించబడిన తర్వాత, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ మరియు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలను కూడా కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా నియంత్రిస్తుంది.   సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం కొత్త ముసాయిదా చట్టం గురించి తెలియజేస్తూ X…

CINEMA

నటుడు చంద్రమోహన్ కన్నుమూత..

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్.. కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. హీరోగా 175 సినిమాల్లో నటించారు.   ఐరన్ లెగ్ గా పేరొందిన హీరోయిన్స్ చంద్రమోహన్ తో నటిస్తే.. సూపర్ స్టార్స్ అవుతారని అప్పట్లో సెంటిమెంట్ ఉండేది. అందుకే ఆయన్ను…

TELANGANA

మాదిగ విరోధులు కాంగ్రెస్, బీఆర్ఎస్.. త్వరలో ఎస్సీ వర్గీకరణ కమిటీ : ప్రధాని మోదీ..

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదిగ ఉపకులాలను విరోధులగా చూస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో శనివారం జరిగిన మాదిగల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని ప్రకటించారు.   మాదిగల విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ…

TELANGANA

రికార్డు స్థాయిలో 4795 నామినేషన్లు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే అసలైన వార్…

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అసలు సిసలు ప్రచార హోరు మొదలవనుంది. ఈ దీపావళి ఏ పార్టీల్లో వెలుగులు నింపుతుంది.. ఏ పార్టీకి చీకట్లు నింపుతుందన్నది ఉత్కంఠగా మారింది. పైకి ముక్కోణపు పోరు అంటున్నా.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య అసలైన ఎన్నికల యుద్ధం కనిపిస్తోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండడంతో టైం చాలా తక్కువగా ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి.   ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన…

CINEMA

సలార్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా సలార్. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండటంతో టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. సలార్ పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ లోనే విడుదలవ్వాల్సి ఉండగా.. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేశారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ను డిసెంబర్ 22న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.   సినిమా…

National

ప్రజాప్రతినిధులపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

పబ్లిక్ సర్వెంట్స్ , ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి.. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,175 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 40 శాతం.. అంటే 2,116 కేసులు కనీసం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టుల డేటాను పిల్ ప్రస్తావించింది. పిటిషనర్ల అభ్యర్థనపై, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్..ఈ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ కోసం ప్రత్యేక బెంచ్…

AP

100 రోజుల ప్రణాళిక.. ఉమ్మడి మేనిఫెస్టో.. అజెండా ఇదేనా..?

తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఏజెండాతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల నేతలు విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపకల్పనపై చర్చలు జరిగినట్లు సమాచారం.   పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా సమావేశం జరిగిందని తెలుస్తోంది. మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా వెళ్లేందుకు కరపత్రం రెడీ చేసినట్లు సమాచారం.…