ఇండిగో విమానాల్లో గందరగోళం: సాంకేతిక సమస్యలపై నటుడు నరేశ్ ఫైర్, ప్రైవసీ కోల్పోతున్నామని ఆవేదన
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో (Indigo) తలెత్తిన సాంకేతిక సమస్యలు మరియు విమానాల ఆలస్యం కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గందరగోళంలో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ (Naresh) కూడా చిక్కుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని, మూసి ఉన్న బోర్డింగ్ గేట్ల వద్ద గందరగోళంలో ఉన్న ప్రయాణికుల వీడియోను ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బుధవారం ఉదయం 8:15 గంటలకు తాను హైదరాబాద్‌లోని ఇండిగో టెర్మినల్‌కు…

