జగన్ కు మరో షాక్..! చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆళ్ల నాని..
ఏలూరుకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. గురువారం ఉండవల్లికి వెళ్లిన ఆళ్ల నాని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నానికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.…