రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండా సురేఖ దంపతులు: సద్దుమణిగిన అంతర్గత వివాదం
తెలంగాణలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ దంపతుల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. సోమవారం నాడు మంత్రి కొండా సురేఖ తన భర్త కొండా మురళితో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. కొండా దంపతులు నేరుగా సీఎంను కలిసి విషెస్…

