‘ధురంధర్-2’పై నటి రమ్య ఘాటు విమర్శలు: థియేటర్లో సమయం, డబ్బు వృథా అంటూ వ్యాఖ్య
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్-2’ చిత్రంపై నటి రమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనను తీవ్రంగా నిరాశపరిచిందని, చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రాన్ని చూసిన అనంతరం ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇది ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ఉందని, థియేటర్లలో సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని అభిమానులకు సూచించారు. ఈ సినిమా ఓటీటీలో చూడటానికే సరిపోతుందని…

