రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై సైబరాబాద్ పోలీసుల కొరడా!
ప్రముఖ నటి రేణు దేశాయ్‌ను సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేస్తున్న కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. తనపై నిరంతరాయంగా అసభ్యకర పోస్టులు పెడుతూ, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా వ్యవహరించడం మరియు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. గత…

