మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు: పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ సీజ్!
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌ను పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు. ఈ ఫాంహౌస్‌ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ‘అసైన్డ్ భూమి’లో నిర్మించినట్లు రెవెన్యూ యంత్రాంగం గుర్తించడమే కాకుండా, డ్రగ్స్ పార్టీకి వేదికగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీకి…

