జగిత్యాలలో హైటెన్షన్.. వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి..
జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఉదయం టీపీసీస అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ సందడి మొదలైంది. పార్టీ అంతర్గత పరిణామాలు గందరగోళానికి దారితీయడంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నేరుగా రంగంలోకి దిగింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సంక్షోభ నివారణ…

