ఏపీలో వాహన రిజిస్ట్రేషన్ ఇక 24 గంటల్లోనే.. !
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానుంది. ఈ మేరకు రవాణా శాఖ రూపొందించిన కొత్త విధానానికి ఈ వారంలోనే ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వాహనాల రిజిస్ట్రేషన్‌లో జరుగుతున్న జాప్యంపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.…

