2040లో భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెడతారు: ఇస్రో చీఫ్ నారాయణన్..
వికసిత భారత్‌కు సూచికగా 2040లో భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెట్టనున్నారని ఇస్రో ఛీఫ్ నారాయణన్ పేర్కొన్నారు. అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రస్తుతం అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్ల తయారీ, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రుడిపై అధ్యయనానికి వీనస్ ఆర్బిటర్ మిషన్ ఏర్పాటు వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 2027లో చేపట్టబోయే…

