రాహుల్ గాంధీ దేశంలోనే అతిపెద్ద జోకర్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బిఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ మీద గెలిచి, కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం అత్యంత అప్రజాస్వామికమని, దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హస్తం ఉందని, ఆయన ఒత్తిడి మేరకే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.…

