జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం: లారీ-కారు ఢీకొని దంపతుల మృతి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి-కోరుట్ల జాతీయ రహదారిపై పెద్దగుండు ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని కారులో తిరిగి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వారి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్, ఆయన భార్య లావణ్యగా గుర్తించారు. వీరి కుమార్తె…

