బంగ్లాదేశ్‌లో ఆగని హింస: ఢాకాలో బాంబు పేలుడు.. ఒకరి మృతి! అల్లకల్లోలంగా మారిన రాజధాని
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. రాజధాని ఢాకాలో బుధవారం (డిసెంబర్ 24, 2025) సాయంత్రం చోటుచేసుకున్న బాంబు పేలుడు దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఢాకాలోని రద్దీగా ఉండే మోఘబజార్ ప్రాంతంలోని ఫ్లైఓవర్ పైనుంచి గుర్తుతెలియని దుండగులు బాంబు విసిరారు. ఈ పేలుడు ధాటికి ఒక ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసే సియామ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఫ్లైఓవర్ కింద ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నం…

