ఎమ్మెల్యే మందుల సామేలు వ్యాఖ్యలపై భగ్గుమన్న బ్రాహ్మణ సంఘాలు: వివరణ కోరనున్న పీసీసీ.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు!
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అక్కడ ఉన్న బ్రాహ్మణ పురోహితులు వేదాశీర్వచనం అందిస్తున్న సమయంలో.. “వీళ్లంతా ఎందుకు? వీళ్ల అవసరం ఏముంది?” అనే అర్థం వచ్చేలా ఆయన హేళన చేస్తూ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు మరియు బీజేపీ నేతలు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం…

