Editor

AP

కరవులో రైతాంగం.. దోపిడీలో కూటమి ప్రభుత్వం: పేర్ని నాని

అధికార పీఠం ఎక్కేందుకు ఊహాజనిత హామీలతో ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పూర్తిగా పక్కనబెట్టేసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు అందక, సరైన ప్రణాళికలు లేక కరవు కోరల్లో చిక్కుకుని రైతాంగం అల్లాడిపోతుంటే… కూటమి నాయకులు మాత్రం పాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని దోచుకోవడంలో నిమగ్నమయ్యారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ అందించిన పారదర్శక సంక్షేమ పథకాల కంటే మిన్నగా పథకాలు ఇస్తామంటూ…

AP

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా..? ఈడీ క్లారిటీ..!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈడీ ప్రెస్ నోట్‌లో ‘జంతువుల కొవ్వు’ అనే పదం లేకపోవడంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వర్గాలు ఈ విషయాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో తిరుమల లడ్డూలో అసలు ఏం జరిగింది? జంతువుల కొవ్వు ఉందా? లేదా? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న కి పెట్టె ప్రసాదంలో నెయ్యికి…

AP

వైసీపీ మాజీ ఎమ్మెల్యే గనులపై మైనింగ్ శాఖ దాడి.. క్వారీ యంత్రాలు, వాహనాలు స్వాధీనం..

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు పరిధిలో అక్రమ మైనింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి చెందిన గనుల్లో లీజు నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తున్నారన్న ఫిర్యాదులపై మైనింగ్ శాఖ అధికారులు ఈరోజు మెరుపు దాడులు నిర్వహించారు. సాంకేతిక బృందాలతో కలిసి రంగంలోకి దిగిన అధికారులు మైనింగ్ సరిహద్దులు, పరిమితికి మించిన క్వారీయింగ్ ఆరోపణలపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అధునాతన మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా నిబంధనలను…

National

మెడికల్‌ షాపుల్లో సీసీటీవీ నిఘాలోనే మందులు.. కేంద్రం కొత్త ప్రతిపాదనలు..

డాక్టర్ల సిఫార్సుతో విక్రయించే మందులపై కేంద్రం మరింత కఠిన నిఘాకు సిద్ధమవుతోంది. మందుల దుకాణాలు, ఇతర లైసెన్స్‌ పొందిన రిటైల్‌ కేంద్రాల్లో ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగా మందులు విక్రయించే సమయంలో సీసీ కెమెరా నిఘా తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీసుకొచ్చింది.సెప్టెంబర్‌ 8న జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం.. రిజిస్టర్డ్‌ వైద్యుడు సూచించిన ఏదైనా మందును హోల్‌సేల్‌ విక్రయాలు మినహా ఇతర మార్గాల్లో సరఫరా చేసే సమయంలో లైసెన్స్‌ పొందిన ప్రాంగణంలో…

TELANGANA

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల..

తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు ఓటర్ల నమోదు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 20న ఓటర్ల నమోదుకు సంబంధించి పబ్లిక్ నోటీసు జారీ చేయనున్నారు. అప్పటి నుంచి నవంబర్ 6 వరకు అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నవంబర్ 25న ముసాయిదా…

TELANGANA

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై ప్రభుత్వ దృష్టి.. రంగంలోకి రెవెన్యూ అధికారులు..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన ఫామ్‌హౌస్‌ భూములపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో నివేదికలు సిద్ధం చేస్తున్నారు.ఫామ్‌హౌస్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, గతంలో ఆ భూములను సాగు చేసిన రైతుల పేర్లు, ప్రస్తుత భూ రికార్డుల వివరాలతో అధికారులు సమగ్ర నివేదికలను రూపొందిస్తున్నారు.కేసీఆర్ ఫామ్‌హౌస్‌…

AP

రాష్ట్రంలో తీవ్ర కరవుపై ముందస్తు చర్యలు శూన్యం: కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజం..

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమవుతున్న కరవు, వర్షాభావ పరిస్థితులపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లాల వారీగా పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి సెప్టెంబర్‌ 16 వరకు రాష్ట్రంలో 51 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైందని, మొత్తం 688 మండలాల్లో 628 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.…

TELANGANA

సెమీకండక్టర్ రంగానికి రెడ్ కార్పెట్.. సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ..

భవిష్యత్తు ప్రపంచ సాంకేతిక రంగాన్ని, కృత్రిమ మేధస్సు విప్లవాన్ని శాసించబోతున్న సెమీకండక్టర్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే వ్యూహంలో భాగంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ పరికరాలు, చిప్ డిజైనింగ్, తయారీ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా, తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ బృందం ప్రకటించింది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య,…

TELANGANA

కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ.. 30 రోజుల్లో నివేదిక: రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బుధవారం శాసనసభలో మాట్లాడిన ఆయన, ఈ విచారణను 30 రోజుల్లోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.కేసీఆర్‌కు 700 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందో లేదో నిగ్గుతేల్చాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ విషయాన్ని కేసీఆర్ ఎందుకు వెల్లడించలేదని ఆయన ప్రశ్నించారు. విచారణలో…

AP

స్థానిక ఎన్నికల కోసం చంద్రబాబు మళ్లీ అవే హామీలు ఇస్తున్నారు: శ్రీకాంత్ రెడ్డి..

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలపై బూటకపు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తీవ్రంగా విమర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం, జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు ఇప్పుడు ఘనతను దక్కించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలను విస్మరించి మహిళలు, రైతులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని…