రూ. 2000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. వెనక్కి తీసుకోబోమన్న కేంద్రం..
రూ. 2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నూతన విధానం 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తుందని, దీనిపై పునరాలోచన చేసే ఉద్దేశం లేదని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అయితే, ఈ ఛార్జీలు కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తాయని, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం…

