శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్.. బుమ్రా దూరం, సుందర్‌కు గాయం
శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతున్న వేళ గాయాల సమస్య జట్టును కలవరపెడుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. 2017లో చివరిసారిగా శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడిన భారత జట్టులో ప్రస్తుతం కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు మాత్రమే అక్కడ ఆడిన అనుభవం ఉంది. ఈ సిరీస్‌కు ముందు శ్రీలంక బోర్డు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక వార్మప్ మ్యాచ్…

