ఏపీలో దివ్యాంగులకు అదిరిపోయే వార్త: ‘ఇంద్రధనస్సు’ పథకంతో ఉచిత బస్సు ప్రయాణం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించారు. ఈ పథకానికి “ఇంద్రధనస్సు” అని పేరు పెట్టారు. గతంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో 50 శాతం రాయితీ మాత్రమే ఉండేది. అయితే, ఈ కొత్త పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, వారు మహిళల మాదిరిగానే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ మరియు సిటీ బస్సులలో రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం ద్వారా…

