గిరిపుత్రుల చెంత జనసేన ఆవిర్భావ వేడుకలు: అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిశిఖర గ్రామమైన నందిగరువులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయిన సందర్భంగా, జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలను ఆడంబరాలకు దూరంగా గిరిజనుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాటా-మంతి’ కార్యక్రమంలో ఆయన గిరిజనులతో నేరుగా ముచ్చటించి, దశాబ్దాలుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 70 ఏళ్లుగా సరైన రహదారి లేని ఈ గ్రామానికి రూ. 2 కోట్లతో…

