జగిత్యాల జిల్లాలో విషాదం: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీల మృతి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో మంగళవారం సాయంత్రం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన కూలీలు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ముగిలిపేట గ్రామ శివార్లలో జరగడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే, మల్లాపూర్ మండలానికి చెందిన కొందరు వ్యవసాయ కూలీలు ఉదయం పసుపు కోత పనుల కోసం పొలానికి వెళ్లారు. పనులన్నీ…

