వెలుగులోకి వస్తోన్న రౌడీషీటర్ శ్రీకాంత్ హిస్టరీ..
అతడో కరడుగట్టిన నేరగాడు. హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక సమయంలో జైలు నుంచి పారి పోయాడు. నాలుగున్నరేళ్లుగా బయటే ఉండి నేర సామ్రాజ్యం విస్తరించాడు. హత్యలు, దాడులు, కిడ్నాపులు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్.. ఇలా అతడు చేయని నేరం లేదు. 4 జిల్లాల పరిధిలో సుమారు 200 మందితో ఒక గ్యాంగు ఏర్పాటు చేసుకున్నాడు. జైల్లో ఖైదీగా ఉంటూ.. జైలర్ ఎవరుండాలో కూడా డిసైడ్.. ఏ కాంట్రాక్టు పనికి…

