జగన్ దేశాన్ని అవమానించారు… జాతికి క్షమాపణ చెప్పాలి: నారా లోకేశ్..
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి పవిత్రమైన రోజున జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి జగన్ గైర్హాజరు కావడం దేశాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకపోవడం కేవలం అహంకారం మాత్రమే కాదు, మన దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని తీవ్రంగా అవమానించడం” అని వ్యాఖ్యానించారు. జగన్ చర్య, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం…

