చిన్న పట్టణాలకూ ఐటీ… కేసీఆర్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కేటీఆర్..!
చిన్న పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించే విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన కృషిని కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ, “కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టైర్-2 నగరాలకు ఐటీని తీసుకెళ్లడం మా ప్రాధాన్యతగా ఉండేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో…

