సీపీఎం నేత రామారావు హత్య: కాంగ్రెస్ పనేనని పోతినేని సుదర్శన్‌రావు ఆరోపణ
సీపీఎం నేత సామినేని రామారావు హత్య రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్‌రావు తీవ్రంగా స్పందించారు. రామారావు హత్య ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకుల చేతే జరిగిందనే అనుమానం లేదని ఆయన బహిరంగంగా ఆరోపించారు. మధిర నియోజకవర్గంలో గత కొంతకాలంగా హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయని, ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాపక్షాన నిలబడి పోరాడే నిబద్ధత గల నేతను కడతేర్చడం వెనుక రాజకీయ ఉద్దేశ్యాలే ఉన్నాయని…

