జైపూర్‌లో మరో రోడ్డు ప్రమాదం: టిప్పర్ బీభత్సంతో 10 మంది మృతి!
రాజస్థాన్‌లో వరుసగా రెండో రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లోని హర్మారా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహా మండి ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, లోహా మండీ నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను, జనాలను ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో 10…

