పద్మనాభస్వామి ఆలయం బి-నేలమాళిగపై ఉత్కంఠ.. పూజారిదే తుది నిర్ణయం..!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో అత్యంత రహస్యమైన ‘బి-నేలమాళిగ’ తెరిచే అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తెరపైకి వచ్చిన ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకునే కీలక బాధ్యతను ఆలయ తంత్రికే (ప్రధాన పూజారి) అప్పగించారు. దీంతో ఈ మిస్టరీ వీడుతుందా లేదా అనే ఉత్కంఠ మళ్లీ మొదలైంది. గురువారం తిరువనంతపురంలో ఆలయ పాలక మండలి, సలహా మండలి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…

