ఈవీఎంలు వద్దు… బ్యాలెట్ విధానం మళ్లీ తీసుకురండి: ఈసీని కోరిన బీఆర్ఎస్ ..
ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) వాడకంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మంగళవారం నాడు ఢిల్లీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులతో సమావేశమై పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించింది. ఈవీఎంల విశ్వసనీయతపై గత కొన్నేళ్లుగా అనేక సందేహాలు తలెత్తుతున్నాయని, చాలా రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు…

