ఏపీలో జీసీసీ ఏర్పాటు చేయండి: ఏబీమ్ కన్సల్టింగ్ సంస్థను కోరిన మంత్రి నారా లోకేశ్..
ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఏబీమ్ కన్సల్టింగ్ సంస్థను కోరారు. సింగపూర్‌లో ఏబీమ్ కన్సల్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ యానో టోమోకాజుతో మంత్రి లోకేశ్ బుధవారం నాడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, విశాఖపట్నం ఐటీతో పాటు డేటా సిటీగా అభివృద్ధి చెందుతోందని, జీసీసీ సెంటర్ల ఏర్పాటుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఇటీవలే ఏఎన్‌ఎస్‌ఆర్ సంస్థ…

