భీమవరం డీఎస్పీ వివాదం: డిప్యూటీ సీఎం ఫిర్యాదుపై డిప్యూటీ స్పీకర్ క్లీన్ చిట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పేకాట శిబిరాలు, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు డీఎస్పీ జయసూర్యపై వచ్చాయి. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో, ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఈ వ్యవహారంపై మాట్లాడారు. డీఎస్పీపై నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశిస్తూ, అసాంఘిక కార్యక్రమాలకు అండగా ఉండటాన్ని ప్రభుత్వం ఉపేక్షించదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం…

