అదిరిపోయే డిజైన్ తో వస్తున్న మోటరోలా ఫోన్లు
మోటరోలా ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త ఫోన్లను ఈ నెల 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. చైనాకు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. పలు ధరల శ్రేణిలో వరుసగా స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తూ, మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఖరీదైన శ్రేణిలో ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజర్ ఫోన్లను 13వ తేదీన విడుదల చేయనుంది.…

