News

TELANGANA

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికో చెప్పేసిన కేటీఆర్..!

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇస్తామో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9 లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన తేల్చి చెప్పారు.   ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో రెండు నెలలుగా దయనీయమైన పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం…

TELANGANA

ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు: హరీశ్ రావు..

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా, ఈ అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి రావడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నదాతలకు ఈ కష్టాలు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు.   బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దర్జాగా బతికిన రైతు.. నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం…

National

ఆధార్ తో ధ్రువీకరణ… ఒప్పందం కుదుర్చుకున్న స్టార్‌లింక్..!

భారత్‌లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. వినియోగదారుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే లక్ష్యంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)తో స్టార్‌లింక్ ఒప్పందం కుదుర్చుకుంది.   ఈ ఒప్పందం ద్వారా స్టార్‌లింక్ సంస్థ ఆధార్ ఆధారిత డిజిటల్ ధ్రువీకరణ (ఈకేవైసీ) విధానాన్ని ఉపయోగించనుంది. భారత్‌లో ఎక్కువ మంది పౌరుల వద్ద ఇప్పటికే ఆధార్…

AP

అటవీశాఖ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి… పవన్ కల్యాణ్ ఫైర్..!

ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.   “శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి, దాడికి…

AP

కోవూరు ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ‌..!

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డికి బెదిరింపు లేఖ రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ నెల 17న ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్య‌క్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇంటికి వ‌చ్చాడు. అక్క‌డ ఉన్న భ‌ద్ర‌తా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. అనంత‌రం కార్యాల‌యం సిబ్బంది స‌ద‌రు వ్య‌క్తి ఇచ్చి వెళ్లిన ఆ లేఖ‌ను తెరిచి చూశారు.   ఆ లేఖ‌లో వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి త‌న‌కు రూ. 2కోట్లు ఇవ్వాల‌ని, లేదంటే…

TELANGANA

సింగరేణికి ‘బంగారు’ అవకాశం.. కర్ణాటకలో పసిడి గనుల అన్వేషణకు లైసెన్స్..

సింగరేణి సంస్థ కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించింది. బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ దక్కించుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్‌గా నిలిచిందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు.   సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయం…

TELANGANA

జీఎస్టీ కౌన్సిల్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు అంటూ కేంద్రం ప్రచారం చేసుకుంటోందని, కానీ ధరల తగ్గింపుపై చిత్తశుద్ధి లేదని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.   కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5 శాతం…

Uncategorized

ప్రజాప్రతినిధులపై కేంద్ర కొత్త చట్టం..! జైలుకెళ్తే పదవి రద్దు.,.!

ప్రజల కోసం రకరకాల చట్టాలను తీసుకొస్తోంది కేంద్రప్రభుత్వం. కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం పెద్దగా చట్టాలు లేవు. తాజాగా కేంద్రం కొత్త చట్టానికి పదును పెడుతోంది. తీవ్రమైన కేసుల్లో జైలుకి వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేందుకు కొత్త చట్టం తీసుకురానుంది.   ప్రధానమంత్రి మొదలు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు తీవ్రమైన నేరాల కిందట అరెస్టయి నెల రోజుల పాటు జైల్లో ఉంటే అటోమేటిక్‌గా పదవి రద్దు కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును…

AP

వెలుగులోకి వస్తోన్న రౌడీషీటర్ శ్రీకాంత్ హిస్టరీ..

అతడో కరడుగట్టిన నేరగాడు. హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక సమయంలో జైలు నుంచి పారి పోయాడు. నాలుగున్నరేళ్లుగా బయటే ఉండి నేర సామ్రాజ్యం విస్తరించాడు. హత్యలు, దాడులు, కిడ్నాపులు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్.. ఇలా అతడు చేయని నేరం లేదు. 4 జిల్లాల పరిధిలో సుమారు 200 మందితో ఒక గ్యాంగు ఏర్పాటు చేసుకున్నాడు.   జైల్లో ఖైదీగా ఉంటూ.. జైలర్ ఎవరుండాలో కూడా డిసైడ్.. ఏ కాంట్రాక్టు పనికి…

AP

పర్యాటక రంగంపై ఏపీ సర్కార్ ఫోకస్..! 280 కోట్లతో భారీ ప్రాజెక్టులు..

ఏపీ పర్యాటక రంగాన్ని జాతీయ స్థాయిలో మరింత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలు, పురాతన శిల్పకళ అన్నట్టుగా ఉన్న ఏపీలో ప్రతి జిల్లా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ శక్తిని ప్రపంచానికి చూపించేందుకు, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలిపేందుకు ఏపీ ప్రభుత్వం తాజా ప్రణాళికలతో ముందుకు వెళ్లింది. దాదాపు రూ. 280 కోట్ల విలువైన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టుల్లో లేపాక్షి,…