అది ఫేక్ వీడియో అంటారా..? జగన్‌పై షర్మిల ఫైర్..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తన సోదరుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి విషయంలోనూ జగన్ ప్రజలను వంచించారని, అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్లని ఆయన, ఇప్పుడు ఓటమి తర్వాత జన సమీకరణ పేరుతో బల ప్రదర్శనలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా…

