News

National

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..నేర చరిత్ర ఉంటే దేశంలోకి నో ఎంట్రీ..

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గతంలో నేరాలకు పాల్పడి, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విదేశీయులు తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.   గతంలో భారత్‌కు వచ్చి గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలు, హత్యలు, అత్యాచారాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన…

AP

బీఆర్ఎస్ కు పట్టిన గతే జనసేనకు పడుతుంది!: సీపీఐ నారాయణ హెచ్చరిక..

బీజేపీతో జతకట్టే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. బీజేపీ అందించేది అభయహస్తం కాదని, అది పార్టీలను నాశనం చేసే ‘భస్మాసుర హస్తం’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.   ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి, వాటిలో చీలికలు తీసుకురావడమే బీజేపీ వ్యూహమని నారాయణ ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. బీజేపీకి…

National

ఎస్‌సీఓ వేదికగా ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు..

‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశంలో ఉండగానే, ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతునిస్తున్న కొన్ని దేశాల ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని గుర్తుచేస్తూ, ఇలాంటి చర్యలను ప్రపంచ సమాజం అంగీకరించాలా? అని సూటిగా ప్రశ్నించారు.   సోమవారం టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు ప్రారంభోపన్యాసంలో మోదీ మాట్లాడారు.…

TELANGANA

కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో నిరాశ..

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు తమ పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టడానికి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది.   ఈ పిటిషన్‌ను సాధారణ కేసుల మాదిరిగానే విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. రేపు ఉదయం…

National

యుద్ధం ముగియాలి.. శాంతి నెలకొనాలి: పుతిన్‌తో భేటీలో మోదీ..

ఉక్రెయిన్ సంక్షోభంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వైఖరిని మరోసారి ప్రపంచ వేదికపై స్పష్టం చేశారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలికి, శాంతిని పునరుద్ధరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. చైనాలోని తియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా సోమవారం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.   ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “యుక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ఇటీవల జరుగుతున్న ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం. ఇందులో భాగస్వాములైన అన్ని…

TELANGANA

చంద్రబాబు, పవన్, కేసీఆర్, జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా… తెలుగువాడికి అవకాశం వచ్చింది: రేవంత్ రెడ్డి..

ఉపరాష్ట్రపతిగా తెలుగు వ్యక్తిని గెలిపించుకునే అవకాశం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి” అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  …

AP

భవిష్యత్తును ఊహించి ముందుకెళ్లే దార్శనికుడు సీఎం చంద్రబాబు: పవన్ కల్యాణ్..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. చంద్రబాబు దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయం అని కొనియాడారు.   “భవిష్యత్తును ఊహించి ప్రణాళికబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దార్శనికుడు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం…

National

చైనాతో స్నేహమా..? మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్..

ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ఆదివారం టియాంజిన్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిగిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చైనా పట్ల మోదీ సర్కార్ అనుసరిస్తున్న మెతక వైఖరిని ఎండగడుతూ, దేశ భద్రత విషయంలో రాజీ పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా దూకుడుకు, బెదిరింపులకు తలొగ్గడమే భారత కొత్త భద్రతా విధానమా అని సూటిగా ప్రశ్నించింది.   కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ‘ఎక్స్’…

AP

కూటమి 15 ఏళ్లు కొనసాగాలి… జనసేన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన పవన్..!

ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక విజయం తర్వాత జనసేన పార్టీ భవిష్యత్ ప్రయాణంపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దకాలానికి యువ నాయకత్వాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా కీలక కార్యాచరణను ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి సుస్థిర పాలన అందించేందుకు ప్రస్తుత ఎన్డీయే కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ…

National

టిక్ టాక్ భారత్ లోకి రీఎంట్రీ..!

ప్రముఖ సోషల్ మీడియా వేదిక టిక్ టాక్ మళ్లీ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. గురుగ్రామ్ లోని తమ కార్యాలయంలో ఉద్యోగులను నియామించుకోవడానికి టిక్ టాక్ నోటిఫికేషన్ జారీ చేయడం సందేహాలకు తావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన, డ్రాగన్ అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ నేపథ్యంలో టిక్ టాక్ తాజా నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. అయితే, కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేసే…