ఏపీ పాలనపై ప్రధాని మోదీ ప్రశంసలకు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్!
ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన పాలన కొనసాగుతోందని.. ఎన్డీయే పాలన భేష్ అని ప్రధాని మోదీ ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ఎంపీలతో ఏపీ పాలనపై ప్రశంసలు కురిపించడాన్ని తప్పుబట్టారు. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో షర్మిల విరుచుకుపడ్డారు. పచ్చకామెర్లు సోకినోడి సామెతను ప్రధాని మోదీ గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రానా నిజాలు మరుగున పడవని పేర్కొన్నారు. ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ…

