ఐపీఎస్ అధికారి సంజయ్‌కు బిగ్ రిలీఫ్: 112 రోజుల తర్వాత బెయిల్ మంజూరు
ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారనే అభియోగాలపై అరెస్టయిన ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సంజయ్.. అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు రావడంతో, ఏసీబీ (Anti-Corruption Bureau) ఆయనపై కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సంజయ్‌ను అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి సుమారు 112 రోజులుగా ఆయన విజయవాడ జైలులో రిమాండ్…

