తిరుపతి-షిర్డీ రైలుపై సీఎం చంద్రబాబు ప్రతిపాదన..! కేంద్రం ఆమోదం..
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వరకు తాత్కాలిక ప్రాతిపదికన నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 07637/07638)కు రైల్వే శాఖ శాశ్వత హోదా కల్పించింది. ఈ మేరకు రైలును క్రమబద్ధీకరించి రెగ్యులర్ రైలుగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 2న రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ పంపారు. …

