News

TELANGANA

హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..! 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు..

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పర్యావరణ హితమైన ప్రజారవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద నగరానికి 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు, కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడనుంది.   కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్…

TELANGANA

ఒక బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు కనిపిస్తే, ఏదో పెను ప్రమాదం జరిగిపోయినట్లుగా చెబుతున్నారు..-: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు నిలకడగా వెలుగులోకి వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాళేశ్వరంపై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు.   హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు కనిపిస్తే, ఏదో పెను ప్రమాదం జరిగిపోయినట్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఘోష్ కమిటీ విచారణ పూర్తయిందని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా నోటీసులు…

National

ఢిల్లీకి పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్..! భారీ ఉగ్రకుట్ర భగ్నం..!

దేశంలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. నిఘా సంస్థల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నేరుగా యుద్ధం చేసే సత్తా లేక ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ దాడులు చేయాలనే దాయాది ప్లాన్‌కు చెక్‌ పెట్టాయి భారత నిఘా సంస్థలు. ఈసారి వారి ఎత్తులకు పైఎత్తు వేయడంతో దేశ రాజధానిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇందుకోసం మూడు నెలల పాటు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాయి ఇండియన్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీస్. ఓ పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌తో పాటు.. అతడికి సహకరించిన మరో…

AP

లిక్కర్ స్కామ్.. కూటమి సర్కార్‌పై జగన్ ఫైర్..!

ఎట్టకేలకు మద్యం కుంభకోణంపై నోరు విప్పారు మాజీ సీఎం జగన్. రేపో మాపో ఆయన అరెస్టు అవుతారన్న వార్తల నేపథ్యంలో వాటిపై ఆసక్తికర స్టేట్‌మెంట్ చేశారు. వైసీపీ హయాంలో లిక్కర్ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని తేల్చేశారు. ఆయనకు ఆయనే క్లీన్‌చిట్ ఇచ్చుకున్నారు. తప్పంతా చేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని ఎదురుదాడి మొదలుపెట్టారు.   భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్షాలు సృష్టించి అరాచకంగా ప్రభుత్వం వ్యవహారి స్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తనను బెదిరిస్తుందని చెబుతూ ఏపీ బేవరేజెస్ మాజీ…

AP

జగన్‌కి కౌంటర్, తారకరత్న భార్య పోస్టు.. సాయిరెడ్డికి మద్దతుగా..

ఇంటి గుట్టు లంకకు చేటు అన్న సామెత మాజీ సీఎం జగన్‌కు అతికినట్టు సరిపోతుంది. కోర్ టీమ్ ప్లాన్‌తో నమ్మినబంటు విజయసాయిరెడ్డిని జగన్ దూరం చేసుకున్నారు. దాని పర్యవసానాలు ఇప్పుడిప్పుడే జగన్ అర్థమైనట్టు కనిపిస్తోంది. దాన్ని నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి విజయసాయిరెడ్డిని టార్గెట్‌గా చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తన బాబాయి విజయసాయిరెడ్డికి మద్దతుగా ఆసక్తికరమైన పోస్టుపై చర్చ జరుగుతోంది.   ఇదీ అలేఖ్య…

NationalTechnology

గూగుల్ ఏఐ మోడ్… ఏదైనా చిటికెలోనే..!

ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసే దిశగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కీలక అడుగులు వేస్తోంది. తన వార్షిక డెవలపర్ల సమావేశం ‘గూగుల్ I/O 2025’లో భాగంగా, వినియోగదారుల కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత షాపింగ్ ఫీచర్లను ఆవిష్కరించింది. ఈ నూతన ఆవిష్కరణలు కొనుగోలు ప్రక్రియను మరింత వ్యక్తిగతంగా, సౌకర్యవంతంగా మార్చనున్నాయి.   గూగుల్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ AI షాపింగ్ ఫీచర్లకు జెమినీ AI సాంకేతికత మరియు గూగుల్ షాపింగ్ గ్రాఫ్…

TELANGANA

గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు విడుదల చేస్తూ.. 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిన రేవంత్ సర్కార్..

గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే రూ.153 కోట్లు విడుదల చేస్తూ 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బిల్లులను ఈ విడతలో చెల్లించడం గమనార్హం. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగిల్చిన భారీ మొత్తంలో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు నడుం బిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం…

AP

వైఎస్ జగన్ మీడియా సమావేశం..! కారణం అదేనా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం రాజకీయంగా ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ఏమి మాట్లాడతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక వైఎస్సార్‌సీపీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రజలకు కొన్ని కీలక సందేశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేసిన…

National

పాక్ ఏజెంట్ కు పెళ్లి ప్రపోజల్ చేసిన యూట్యూబర్ జ్యోతి..!

దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తూ సంచలనం సృష్టిస్తోంది.   గత వారం అదుపులోకి తీసుకున్న జ్యోతి మల్హోత్రాను అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు…

AP

నూతన రేషన్ విధానంపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి నాదెండ్ల..

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) ద్వారా ఇంటింటికీ రేషన్ అందించే ప్రక్రియను నిలిపివేసి, తిరిగి చౌకధరల దుకాణాల (రేషన్ షాపుల) ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.   రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల…