News

AP

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేసి మళ్లీ జరపాలి: జగన్ డిమాండ్..

పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక…

National

జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం.

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల విచారణపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జడ్జెస్ (ఇంక్వైరీ) ఆక్ట్- 1968 కింద ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులుగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరవింద్…

TELANGANA

రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది. మూసీ నది పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, సెమీకండక్టర్, రక్షణ రంగ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. రూ.1.5 లక్షల కోట్లతో హైదరాబాద్‌ను అద్భుత నగరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి ఆధునిక ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక…

AP

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!

రాష్ట్రంలోని మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారబోయే ‘స్త్రీశక్తి’ పథకం ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఈ పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అధిక రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, భద్రత అంశంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం…

AP

వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..!

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోందంటూ ఆయన కుమార్తె సునీత ఆరోపిస్తున్నారు. హత్యకేసులో కీలక నిందితులు తప్పించుకోవాలని చూస్తున్నారని, తమకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరిపై ఒత్తిడి తెచ్చారని అంటున్నారు. ఈ బెదిరింపులపై ఆమె చేసిన ఫిర్యాదుని పరిగణలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జైలులో దస్తగిరిని బెదిరించిన విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్…

AP

పీ4 కార్యక్రమంపై స్వర్ణాంధ్ర ఫౌండేషన్ స్పష్టత..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 (ప్రజా-ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమంపై వస్తున్న కొన్ని కథనాల నేపథ్యంలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ స్పష్టత ఇచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు లేదా ప్రభుత్వ శాఖలకు ఎలాంటి కోటాలు విధించడం లేదని, ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమమని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు ఒక ప్రకటనలో తెలిపారు.   పీ4 కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన ఒక ప్రజా ఉద్యమం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా…

AP

మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ ..! త్వరలో డీజీపీ చేతికి ‘ఆడుదాం ఆంధ్రా’ స్కామ్‌పై విజిలెన్స్ నివేదిక..

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈ నివేదికను విజిలెన్స్ విభాగం అధికారులు ఒకటి రెండు రోజుల్లో డీజీపీకి అందజేయనున్నారు. వైసీపీ హయాంలో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయి.   క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర…

CINEMA

వేతన పెంపుపై చర్చలు ఫలించకపోతే షూటింగ్ లు బంద్: కార్మిక సంఘాలు..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వేతనాల పెంపు వివాదంపై చర్చలు కొనసాగుతున్నాయి. నిర్మాతల మండలికి, కార్మిక సంఘాలపై ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో తాజాగా ఈ రోజు మరోసారి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. వేతన పెంపు విషయంలో నిర్మాతలు చేసిన మూడేళ్ల ప్రతిపాదనకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. వేతనాలను 30 శాతం పెంచాలన్న డిమాండ్ పై ఈ రోజు జరగనున్న చర్చలు ఫలవంతం కావాలని…

TELANGANA

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బాలరాజుకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు.   కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి గువ్వల బాలరాజు ఏ పార్టీలో…

TELANGANA

రిటైర్మెంట్ పై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

తన రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్క ప్రకటనతో తెరదించారు. రాజకీయాల నుంచి తాను తప్పుకోవడం లేదని, చివరి వరకు క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. “జపాన్‌లో ప్రజలకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ ఉండదో, నాకు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు” అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.   తనకు ఇప్పుడు 73 ఏళ్లని, ఇంక రాజకీయమే వద్దనుకుంటున్నానని మల్లారెడ్డి నిన్న వ్యాఖ్యానించాడం చర్చనీయాంశంగా…